అజారుద్దీన్ కీలక నిర్ణయం.. HCAలో కొత్త జిల్లాలకు ప్రాధాన్యత

by Shyam |
azaruddin
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ ‌క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన ‌జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్సీఏ సభ్యుల సంఖ్యను పెంచి, అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సాహించనుంది. ఇందులో భాగంగా పలు కొత్త జిల్లాలకు హెచ్సీఏలో‌ సభ్యత్వం కల్పించారు. జిల్లా ‌కోటాలో వాలా శరత్ చంద్ర(మేడ్చల్ జిల్లా), మఠం భిక్షపతి(సంగారెడ్డి), బుద్దుల శ్రవన్ రెడ్డి(వికారాబాద్), దాదన్నగారి సందీప్ కుమార్ (కామారెడ్డి), దావ సురేష్( జగిత్యాల), కల్కుంట్ల మల్లికార్జున్(సిద్దిపేట)లను హెచ్సీఏ ఏజీఎంలో సభ్యులుగా చేరుస్తూ, హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్ ప్రకటించారు. శనివారం నియామక పత్రాలను వారికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు జిల్లాల అడ్‌‌హక్ కార్యదర్శులుగా నియమిస్తూ హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందన్నారు. నూతన అడ్‌హక్ కార్యదర్శులు, సొసైటీస్ చట్టం ప్రకారం సంబంధిత జిల్లా క్రికెట్ అసోసియేషన్లను, ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించనున్నారని తెలిపారు. దీంతో మారుమూల ప్రాంతాల యువతకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, నైపుణ్యాలను ‌పెంపొందించనున్నట్లు అజారుద్దీన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed