సల్మాన్ ఖాన్‌ ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే..? సంచలన నిజాలు చెప్పిన చెల్లెలి భర్త..!

by Shyam |
సల్మాన్ ఖాన్‌ ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే..? సంచలన నిజాలు చెప్పిన చెల్లెలి భర్త..!
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను దేవుడిలా కొలుస్తారు అయన అభిమానులు. సల్మాన్‌కు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఆయన అభిమానులకు మాత్రం ఒకటే బాధ అదే సల్మాన్ పెళ్లి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ చాలా మందితో డేటింగ్ చేసిన సల్లూ భాయ్.. పెళ్లి మాత్రం ఎవరినీ చేసుకోలేదు. ఇంకా బాలీవుడ్ మోస్ట్ ఎలిజ్‌బుల్ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. ఇటీవల సల్మాన్ అంతిమ్ సినిమాలో నటించిన ఆయుష్ శర్మ స్వయాన సల్లూకు బావ. ఆయుష్.. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు.

ఆయుష్ అంతిమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.. సల్మాన్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. సల్మాన్ చాల సాధారణ జీవితం గడుపుతాడని, అసలు అతనికి ఫోన్లు, బట్టలు, కార్లు, బైకులపై ఏ మాత్రం ఆసక్తి ఉండదని అన్నారు. సల్మాన్‌కు సినిమాలు అంటే చాలా ఇష్టమని చెప్పారు. తనను ఒంటరిగా వదిలేస్తే సినిమాలు చూసుకుంటూ కూర్చుంటాడని తెలిపాడు. ఇక సల్మాన్ పెళ్లిపై మాట్లాడుతూ ఆయన అసలు పెళ్లి చేసుకోకపోవాడానికి ముఖ్య కారణం అతనికి అంత సమయం లేకపోవడం అని పెర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed