- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యలో సందడి చేసిన టాలీవుడ్ అగ్ర హీరోలు వీళ్లే.. నెట్టింట షేక్ చేస్తోన్న పిక్స్
దిశ, ఫీచర్స్: భారత ప్రధాని మోడీ చేతుల మీదుగా నిన్న (సోమవారం) అయోధ్యలోని బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించడం కోసం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా వేయికళ్లతో ఎదురు చూశారు. 500 ఏళ్లనాటి కల నెరవేరడంతో ఈ వేడుకకు రామ భూమి ట్రస్ట్ ఎంతో మంది ప్రముఖులను ఇన్వైట్ చేశారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, న్యాయ వ్యవస్థలోని ప్రముఖులు, శాస్త్రవేత్తలు, సంగీత విద్వాంసులు, బిజినెస్‌మెన్‌లు.. ఇక రంగాల వారీగా కొందరు ప్రముఖుల పేర్లను చూసుకున్నట్లయితే.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్, RSS చీఫ్ మోహన్ భగవత్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ఉప ప్రధాని LK అద్వాణీ, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, యూపీ మాజీ CM కల్యాణ్‌సింగ్ కుటుంబాన్ని ఇలా ఎంతోమందిని ఆహ్వానించారు.
వీరితో పాటు పలువురు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని ప్రముఖ సెలబ్రెటీలకు కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్-ఉపాసన అయోధ్యకు చేరుకున్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. చిరంజీవి ఫ్యామిలీతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సుమన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి పలువురు సెలబ్రిటీలు గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని దర్శించుకునేందుకు అయోధ్య చేరుకుని సందడి చేశారు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి.. అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, జాకీష్రాఫ్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురాన్, అలియా భట్, రాజ్ కుమార్ హిరానీ మహావీర్ జైన్, రోహిత్ శెట్టి.. పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం అయోధ్యలో ఈ సెలబ్రిటీలు సందడి చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.