- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాముడికి వెరైటీగా పూజలు చేసిన మంచు లక్ష్మి.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు (వీడియో)
దిశ, సినిమా: దేశ ప్రజలంతా వేయి కళ్లతో ఎదురు చూసిన అయోధ్యలోని కీలక ఘట్టం పూర్తయింది. రామమందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రధాని మోడీ చేతుల మీదుగా సోమవారం జరిగింది. అయితే ఈ వేడుకకు చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత చాలా మంది సెలబ్రిటీలు స్పెషల్ పోస్టులు కూడా చేశారు. అలాగే అక్కడి పోని వారు ఇంట్లోనే పూజలు చేసుకుని దీపం వెలిగించారు. దీనికి సంబంధించిన ఫొటోలు. వీడియోలను నెట్టింట షేర్ చేశారు. ఈ క్రమంలో తాజాగా, మంచు లక్ష్మి కూడా రాముడికి పూజలు చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట చేయడం, దాన్ని లైవ్‌గా చూపించడం అందరికీ తెలిసిందే.
ఇక మంచు లక్ష్మీ తన ల్యాప్ టాప్ ఓపెన్ చేసి లైవ్‌గా చూసింది. లైవ్‌లో బాల రాముడ్ని చూసి.. ల్యాప్ ట్యాప్ మీద పూలు జల్లు.. దీపం వెలిగింది.. జై శ్రీరామ్ అంటూ పూజ చేసింది. ఈ వీడియోను చూసిన వారంతా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అలాగే కొబ్బరికాయ కొట్టి నీళ్లు దానిపై పోయి అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ఇవే తగ్గించుకుంటే మంచిది అంటున్నారు. ఇక మంచు లక్ష్మి విషయానికి వస్తే.. ఆమె టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల తన గ్లామర్ ఫొటోలు షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది.