అయోధ్యకు భారీగా తరలివచ్చిన భక్తులు.. తెల్లవారుజామున తోపులాట (వీడియో)

by Mahesh |   ( Updated:2024-01-27 07:11:42.0  )
అయోధ్యకు భారీగా తరలివచ్చిన భక్తులు.. తెల్లవారుజామున తోపులాట (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం అయోధ్యలోని బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రముఖులు గర్భగుడిలో శ్రీ రాముడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. నిన్న మొత్తం ప్రాణ ప్రతిష్ట కు సంబంధించిన కార్యక్రమమే జరగ్గా నేటి నుంచి సాధరన రామభక్తులకు శ్రీరాముడి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. దీంతో భారీ సంఖ్యలో అయోధ్య గేటు బయట వేచి చూస్తున్న రామభక్తులు ఈ రోజు తెల్లవారుజామున గేట్లు తెరవడంతో ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లారు. దీంతో ఆ సమయంలో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. . తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అధికారులకు ఎటు తోచని పరిస్థితి నెలకొంది. దీంతో అయోధ్యకు వచ్చిన భక్తులకు సౌకర్యాలు సరిగ్గా లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అయోధ్య రాముని దర్శన సమయం

అయోధ్య వచ్చే భక్తుల కోసం ఉదయం ప్రతి రోజు ఉదయం 8:00 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. అలాగే రాత్రి 10:00 గంటల వరకు శ్రీరాముడి దర్శనం ఉంటుంది. మధ్యలో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు దర్శనానికి విరామ సమయం ఉంటుంది. ఈ సమయంలో ఆలయం మూసివేస్తారు. ఆలయ నిర్వహణ బాధ్యత కలిగిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతి గంటకు రాముడికి పండ్లు, పాలు అందజేసేలా చూస్తుంది. ప్రస్తుతం అయోధ్యలో ప్రముఖుల దర్శనాలు జరిగే అవకాశం ఉండటంతో సాధారణ భక్తులకు సెక్యూరిటీ వల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయని.. త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేసి రామ భక్తులకు ప్రశాంతమైన రామ దర్శనాన్ని అందిస్తామని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed