భూవివాదంలో యువకుడిపై గొడ్డలితో దాడి…

by Sumithra |
Ax attack on a young man in a land dispute ...
X

దిశ, నేరేడుచర్ల : ఓ భూవివాదంలో గొడ్డలితో యువకుడిపై దాడి చేసిన సంఘటన మటంపల్లి మండలంలోని రఘునాధపాలెం గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం రఘునాధపాలెం గ్రామ రెవెన్యూ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 247 లో దేవపంగు రాజేష్ అలియాస్ రామయ్యకు గార్లపాటి సైదా కు గతంలోనే పట్టాలు ఇచ్చింది. వీరి హద్దులు పక్క పక్కనే ఉండడంతో హద్దుల విషయంలో తరచూ వారి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. బుధవారం 8 గంటల సమయంలో దేవపంగు రాజేష్ తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగా అక్కడే ఉన్న గార్లపాటి సైదా తోపాటు వారి కుటుంబ సభ్యులు బంధువులు రాజేష్ పై గొడ్డలితో దాడి చేశారు.

ఈ దాడిలో రాజేష్‌కు తలకు, చేతి వేళ్ళకు, పొట్ట భాగంలో తీవ్రంగా గాయలయ్యాయి. దీంతో రాజేష్ కుటంబీకులకు సమాచారం అందించడంతో హూజూర్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాజేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం లోని కిమ్స్ హాస్పటల్ కు తరలించినట్లు తెలిపారు. బాధితుని బాబాయ్ దేవపంగు, రవి ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story