- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ తీసుకొమ్మంటున్న వినాయకుడు.. ఫొటో వైరల్
దిశ, ఫీచర్స్ : తొలి ఏకాదశి నుంచి తెలుగురాష్ట్రాల్లో పండుగ సందడి మొదలు కాగా, ఆషాఢం బోనాలను తెలంగాణ ప్రజలంతా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే గత ఏడాది కరోనా కారణంగా పండుగలకు దూరంగా ఉన్న ప్రజానీకం, ప్రస్తుతం మహమ్మారి భయమున్నా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. రాబోయే వినాయక చవితిని తగిన ప్రొటోకాల్ ప్రకారం జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని, అవసరమైన చర్యలు తీసుకోవాలని గణపతి విగ్రహాలతో సందేశమిస్తున్నాడు ఓ కళాకారుడు.
వడోదరకు చెందిన కళాకారుడు దక్షేష్ జంగిడ్ పర్యావరణ అనుకూలమైన గణేష్ విగ్రహాన్ని రూపొందించారు. టీకాల సీసా మీద వినాయకుడు కూర్చున్నట్లుగా బొమ్మను తయారుచేయగా, చేతిలో ఫేస్ మాస్క్, పక్కన సిరంజి ఉన్నాయి. ‘రాబోయే రోజుల్లో అతిపెద్ద పండుగ వినాయక చవితి, పది రోజులపాటు జరిగే ఉత్సవాలకు ప్రజలు భారీ సంఖ్యలో వస్తుంటారు. అందువల్ల విధిగా అందరూ టీకా వేసుకోవాలని, మళ్లీ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలంతా కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ, మూడో వేవ్ నిరోధించడానికి బాధ్యతగా ఉండాలనే సందేశాన్ని ఇవ్వడానికి విగ్రహాన్ని రూపొందించాను. అయితే మండపాల నిర్వాహకులు ఆయా వేదికల వద్ద టీకా శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. మండపాలకు వచ్చే వారికి మాస్క్ తప్పనిసరి అనే బోర్డులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా శానిటైజేషన్ విధిగా చేయాలి’ అని దక్షేష్ తెలిపాడు.