‘రైతులకు సూచన : యాసంగిలో ఈ పంటనే సాగుచేయాలి’

by Shyam |   ( Updated:2021-12-08 03:39:27.0  )
‘రైతులకు సూచన :  యాసంగిలో ఈ పంటనే సాగుచేయాలి’
X

దిశ, ఉప్పునుంతల: నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలోయాసంగి పంటల ప్రత్యామ్నాయ సాగుపైన అవగాహన కార్యక్రమం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. భరత్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారి మాట్లాడుతూ.. ఈ యాసంగిలో వరి సాగుకు బదులుగా నూనె గింజల పంటలు లేదా వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, పప్పు దినుసుల పంటలు అయినా కంది, పెసర్లు, మినుములు,లేదా మొక్కజొన్న పంటలు వేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి తెలియజేశారు.

యాసంగిలో సాగు చేసే వరి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయదు, కావునా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచించడం జరిగింది. ఒకవేళ రైతులు తమ కుటుంబ అవసరాలకు అనుగుణంగా సాగు చేసుకోవచ్చు, అలాగే మిల్లర్లతో ముందస్తు ఒప్పందం చేసుకున్న రైతులు లేదా సొంతంగా అమ్ముకోలేని వారు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి, కానీ ప్రభుత్వం మాత్రం వరి గింజలను కొనుగోలు చేయదని రైతులకు వివరించడం జరిగింది. అలాగే రైతులు వేసినటువంటి వేరుశనగ పంటల్లో విత్తిన నలబై ఐదు రోజుల తర్వాత మొదటి పూత దశ పూర్తయినప్పుడు ఎకరాకు200 జిప్సను వేసుకుంటే రైతులకు మంచి దిగుబడి కూడా వస్తుందని రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలరాజు,మల్లేష్, ఐశ్వరయ్య ,వెంకటయ్య, ఇదమైయ్యా, శ్రీశైలం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story