వృక్షాధారిత వ్యవసాయమే రైతులకు మేలు

by Shyam |
Awareness of farmers
X

దిశ, వెబ్‌డెస్క్: వృక్షాధారిత వ్యవసాయమే రైతులకు మేలు చేస్తుందని ఐటీసీ బంగారు భవిష్యత్తు ప్రోగ్రామ్ అధికారులు సాయిబాబా రెడ్డి, కరివరదరాజులు అన్నారు. గురువారం ఐటీసీ బంగారు భవిష్యత్తు, గ్రీస్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం వారి సహకారంతో రైతులకు వృక్షాధారిత వ్యవసాయంపై వారు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంటపై ఆధారపడటం వల్ల చీడపీడలు ఏర్పడి పంట దెబ్బతినే అవకాశం ఉందని సూచించారు. పంట మార్పిడి మూలంగా అధిక లాభాలు రావడమే కాకుండా పంట సులభంగా మారుతుందని వెల్లడించారు.

ఇందులో భాగంగానే వివిధ మండలాల్లో వివిధ పండ్ల తోటలు పెంపొందించడం జరుగుతున్నదని తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలోని నశింపేట గ్రామంలోని డెమో ప్లాంట్‌లో మొక్కలు నాటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సర్పంచ్ ముల్కలపల్లి రవి, ఏపీఓ ఈశ్వర్, పంచాయితీ కార్యదర్శి షేక్ చాంద్ సుల్తానా, టెక్నికల్ అసిస్టెంట్, యాదయ్య, గ్రీన్ క్రాస్ సంస్థ కో ఆర్డినేటర్ తండు నాగరాజు, నాగేశ్వరరావు, రవిందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed