అవసరాల నీ కథలో మార్పు అవసరం

by  |
అవసరాల నీ కథలో మార్పు అవసరం
X

కరోనా అవసరాల శ్రీనివాస్ కథకు అడ్డుపడింది. కొత్త కథ రాసుకోవాల్సిందే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అసలు ఏం జరిగింది అంటే… అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమా కథ అమెరికాతో ముడిపడి ఉంటుంది. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో షూటింగ్ చేసే ప్రసక్తే లేదు. అక్కడ కరోనా ప్రభావం భారీగా ఉండడంతో షూటింగ్ లకు అనమతులు ఇవ్వడం రద్దు చేశారు. దాదాపు ఇండియాలాగే అమెరికా కూడా లాక్ డౌన్ అయిపోయింది. ఎప్పుడు సాధారణ పరిస్థితులు ఏర్పడతాయో కూడా తెలియదు. దీంతో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారట. అవసరాల శ్రీనివాస్ ను కథలో అమెరికా ప్రస్తావన రాకుండా మార్పులు చేయమని కోరారట. లేదంటే మేము చాలా నష్టపోవాల్సి వస్తుందని … వెంటనే మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారట. దీంతో చేసేదేమీ లేక అవసరాల ఆ పని మీద ఉన్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

కరోనా కారణంగా ఒక్క అవసరాల శ్రీనివాస్ ఏంటి… పరిస్థితులకు తగినట్లు ఎవరైనా మార్పులు చేసుకోవాల్సిందే అనుకుంటున్నారు జనాలు. కానీ ఈ కథలో మార్పు మంచికే అయితే బాగుంటుంది అంటూ అవసరాలకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Tags: Avasarala Srinivas, Naga shourya, Tollywood

Advertisement

Next Story