వరల్డ్ నెంబర్ వన్ టెస్టు బ్యాటర్ స్థానం కోల్పోయిన జో రూట్

by Shyam |
వరల్డ్ నెంబర్ వన్ టెస్టు బ్యాటర్ స్థానం కోల్పోయిన జో రూట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన నెంబర్ 1 స్థానాన్ని కోల్పోయాడు. ఇక ఆ స్థానానికి ఆసీస్ తరఫున టెస్టు మ్యాచుల్లో అదరగొట్టిన మార్నస్ లబూషేన్‌ ఎగబాకాడు. 912 పాయింట్లు ఖాతాలో వేసుకుని వరల్డ్ నెంబర్ 1 టెస్టు బ్యాటర్‌గా నిలిచాడు. జో రూట్ 897 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇక థర్డ్ ప్లేస్‌లో మరో స్టార్ బ్యాటర్ స్టీమ్ స్మిత్ (884 పాయింట్లు) ఉండగా.. న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 879 పాయింట్లతో నాలుగో స్థానానికి వచ్చాడు.

ఇక టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ 797 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితం కాగా, డేవిడ్ వార్నర్ 775 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లీ 756 పాయింట్లతో 7 స్థానానికి పడిపోయాడు. శ్రీలంక బ్యాటర్ కరుణరత్నే 754 పాయింట్లతో 8వ స్థానం, బాబర్ అజామ్ 750 పాయింట్లతో 9వ స్థానం, మరో ఆసీస్ బ్యాటర్ ట్రావిడ్ హెడ్ 728 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. దీంతో టాప్ 10లో నలుగురు ఆసీస్ బ్యాటర్లు ఉండటం విశేషం.

Advertisement

Next Story