సర్వాంగా సుందరంగా ముస్తాబైన అయోధ్య..

by Shamantha N |
సర్వాంగా సుందరంగా ముస్తాబైన అయోధ్య..
X

దిశ, వెబ్‌డెస్క్ :
అయోధ్య రామమందిరం నిర్మాణ భూమి పూజకు ఇంకా రెండు రోజుల సమయమే మిగిలింది. ఇప్పటికే అయోధ్య నగరాన్ని రామజన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆగష్టు 5న నిర్వహించే భూమి పూజకు ప్రధాని మోడీతో పాటు, 170మంది ప్రముఖులు హాజరుకానున్నారు.దీంతో అక్కడ ఏర్పాట్లు శరవేరంగా జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం 3500 పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది. శ్రీరంగం నుంచి బంగారు ఇటుక, తెలంగాణ నుంచి వెండి ఇటుకలు తరలివెళుతున్నాయి. అయితే, వేదికపై మోడీతో సహా ఐదుగురికి మాత్రమే చోటుకల్పిస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా భూమి పూజ జరిగే సమయంలో అమెరికాలోని హిందూ ఆలయాల్లో వర్చువల్ సామూహిక పూజలు జరుగుతాయని సమాచారం.

Advertisement

Next Story