ఎమ్మెల్యే విడదల రజినీ మరిదిపై దాడి

by srinivas |   ( Updated:2020-02-21 00:39:43.0  )
ఎమ్మెల్యే విడదల రజినీ మరిదిపై దాడి
X

గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే విడదల రజినీ మరిది వెళ్తుతున్న కారుపై శుక్రవారం తెలవారుజామున దుండగులు దాడి చేశారు. కోటప్పకొండకు వెళ్తుండగా కట్టుబడివారిపాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఎమ్మెల్యే మరిది గోపినాథ్ ఉన్నారు. ఈ ఘటనపై చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. గోపినాథ్ మాట్లాడుతూ.. ‘కారులో ఎమ్మెల్యే రజినీ ఉన్నారు అనుకొని టీడీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. కోటప్పకొండకు ప్రభను తీసుకెళ్తున్న సమయంలో కాపు కాసి తమపై దాడి చేశారు’ అని గోపినాథ్ వెల్లడించారు.
ఇక ఈ దాడిపై చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజినీ స్పందించారు. ‘ టీడీపీ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దమ్ముంటే ప్రత్తిపాటి పుల్లారావు ప్రజా క్షేత్రంలో గెలివాలి’ అని రజినీ సవాల్ విసిరారు.

Advertisement

Next Story