కులాంతర వివాహం: కత్తులు, గొడ్డళ్లతో బెదిరింపులు

by Sumithra |
కులాంతర వివాహం: కత్తులు, గొడ్డళ్లతో బెదిరింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ పేరుతో కులాంతర వివాహం చేసుకున్నారని నవ దంపతులపై బంధువులు దాడి చేశారు. కత్తులు, గొడ్డళ్లతో అర్ధరాత్రి ఇంటిమీదకు వచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వ్యవహారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్‌గూడెంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన పుల్లూరి గోపి(21), గరిడేపల్లి కళ్యాణి(19) కాలేజీకి వెళ్లే సమయంలో ప్రేమించుకున్నారు. ఇదే క్రమంలో పెండ్లి చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నారు. కానీ, పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం రక్షణ కల్పించాలని మునగాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే నవదంపతుల జోలికి రావొద్దని తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన కళ్యాణి కుటుంబీకులు గురువారం అర్థరాత్రి కత్తులు, గొడ్డళ్లతో యువకుడి ఇంటిపై దాడి చేశారు.

Advertisement

Next Story