- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడారం గ్రామం ఎస్సీ బాలుర పాఠశాలలో దారుణం
దిశ, ధర్మపురి : ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలంలోని మేడారం గ్రామంలో ఎస్సీ బాలుర పాఠశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా పరీక్షల కేంద్రాన్ని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11గంటల 30 నిమిషాలు దాటినా సిబ్బంది రాకపోవడం, వచ్చినా ఒకరు పడిగాపులు కాస్తున్నా.. బాధితులకు కిట్లు లేవని పరీక్షలు చేయకపోవడం దారుణమని అన్నారు.
ఇంత సమయం దాటినా ఒకే ఒక వ్యక్తి తప్ప ఎలాంటి సిబ్బంది అందుబాటులో లేకపోవడం, మెడికల్ కిట్లు అందుబాటులో లేకపోవడం, మధ్యాహ్నం దాటిన కరోనా పరీక్షలు నిర్వహించకపోవడం చాలా బాధకరమని పేర్కొన్నారు. మండల వైద్యాధికారికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని తెలిపారు. ఇంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కనీసం అధికార పార్టీ నాయకులన్నా పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.