- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండియన్ సూపర్ లీగ్‌లో మోహన్ బగాన్ బోణి
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ISL) 2020-21 సీజన్ తొలి మ్యాచ్ శుక్రవారం బాంబోలిన్‌లోని జీఎంసీ స్టేడియంలో జరిగింది. ఏటీకే మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్, కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 1-0 తేడాతో కేరళపై విజయం సాధించింది.
మోహన్ బగాన్ జట్టు టాస్ గెలిచి కుడి నుంచి ఎడమకు ఎటాక్ చేయడానికి నిర్ణయించుకుంది. ఆట ప్రారంభమైన నాలుగో నిమిషంలోనే మోహన్ బగాన్ జట్టు ఫార్వర్డ్ ఆటగాడు రాయ్ కృష్ణకు ఫ్రీ షాట్ కొట్టే అవకాశం వచ్చింది. కానీ అతడు కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు దూరంగా వెళ్లిపోయింది. 14వ నిమిషంలో మోహన్ బగాన్ జట్టు ఆటగాడు సూసాయ్ గాయపడటంతో అతని స్థానంలో సుభాషిశ్ మైదానంలోకి వచ్చాడు.
రాయ్ కృష్ణకు పదే పదే అవకాశాలు వచ్చినా.. గోల్ పోస్టులోనికి బంతిని తరలించడంలో విఫలమయ్యాడు. 42వ నిమిషంలో కేరళ ప్లేయర్‌ను ఉద్దేశపూర్వకంగా గాయపర్చడానికి ప్రయత్నించినందుకు మోహన్ బగాన్ జట్టు ఆటగాడు గ్రాషియా మార్టిన్‌కు రిఫరీ ఎల్లో కార్డ్ చూపించారు. తొలి అర్థ భాగం ముగిసే సరికి ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యారు. ఈ భాగంలో అత్యధిక సమయం బంతి కేరళ బ్లాస్టర్స్ వద్దనే ఉన్నది. కానీ మోహన్ బగాన్ జట్టు మాత్రమే నాలుగు సార్లు గోల్స్ చేయడానికి ప్రత్నించగా, కేరళ రెండు సార్లు దాడి చేసింది.
రెండో అర్థ భాగంలో మోహన్ బగాన్ ఆటగాళ్లు వేగం పెంచారు. బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడమే కాకుండా గోల్స్ చేయడానికి పదే పదే ప్రయత్నించింది. ఈ క్రమంలో మోహన్ బగాన్ జట్టు ఆటగాడు రాయ్ క్రిష్ణ 67వ నిమిషంలో గోల్ చేశాడు. తనకు అందిన పాస్‌ను సక్రమంగా వినియోగించుకొని గోల్‌పోస్టుకు చాలా దూరం నుంచే బంతిని తరలించాడు. కృష్ణ వేగాన్ని కేరళ బ్లాస్టర్ గోల్ కీపర్ అంచనా వేయలేకపోయాడు. ఈ సీజన్‌లో చేసిన మొదటి గోల్ ఇదే.
ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ కోసం ప్రయత్నించినా విఫలమయ్యారు. 89వ నిమిషంలో కేరళకు చెందిన పెరేయాకు రిఫరీ ఎల్లో కార్డ్ చూపించాడు. చివర్లో 4 నిమిషాలు అదనంగా చేర్చినా గోల్స్ చేయలేకపోయారు. నిర్ణీత సమయం ముగిసేసరికి మోహన్ బగాన్ జట్టు 1-0 తేడాతో కేరళపై విజయం సాధించింది. మ్యాచ్ మొత్తంలో బంతిని అత్యధిక సమయం కేరళనే తమ ఆధీనంలో ఉంచుకున్నా.. గోల్స్ చేయడంలో విఫలమైంది.