- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగళూరుపై ఏటీకే మోహన్‌బగాన్ విజయం
దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా మంగళవారం రాత్రి ఫటోర్డా స్టేడియంలో బెంగళూరు సిటీతో జరిగిన మ్యాచ్‌లో ఏటీకే మోహన్‌బగాన్ క్లబ్ 2-0 తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగళూరు సిటీ బంతిని కిక్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. మొదటి హాఫ్‌లో బంతి బెంగుళూరు నియంత్రణలోనే ఉన్నది. అయితే గోల్స్ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. అయితే సరైన పాస్‌లు ఇచ్చుకుంటూ ఏటీకే మోహన్‌బగాన్ క్లబ్ ధీటుగా జవాబిచ్చింది. ఈ క్రమంలో మోహన్ బగాన్ క్లబ్‌కు 37వ నిమిషంలో పెనాల్టీ లభించింది. కెప్టెన్ రాయ్ కృష్ణ ఎలాంటి తప్పు చేయకుండా పెనాల్టీని గోల్‌గా మార్చాడు. 44వ నిమిషంలో మార్సెలో పెరీరా గోల్ చేయడంతో మోహన్ బగాన్ ఆధిక్యత 2-0కి చేరింది. ఇక రెండో అర్దభాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. నిర్ణీత సమయం ముగిసే సరికి ఏటీకే మోహన్ బగాన్ జట్టు 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ముంబయి సిటీ ఎఫ్‌సీని వెనక్కు నెట్టి మోహన్ బగాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.