అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ వాయిదా

by srinivas |
అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ వాయిదా
X

దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ విచారణకు అడ్డం పడింది. ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మూడురోజుల పాటు కోర్టులకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 30 వరకు న్యాయస్థానాల కార్యకలాపాలను నిలిపివేశారు. దాంతో టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కోర్టు పనులు నిలిచిపోయాయని, అందుకే జూలై 1న బెయిల్ పిటిషన్ విచారిస్తామని వెల్లడించింది.

Advertisement

Next Story