అంతరిక్షంలో ఒలింపిక్స్ ఆటలు.. ట్రెండింగ్‌లో వీడియో!

by Harish |
Astronauts,
X

దిశ, ఫీచర్స్: విశ్వక్రీడల సంరంభం ఆదివారంతో ముగిసిపోగా, ప్రస్తుతం మరో ఒలింపిక్ వార్త నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ట్రాక్‌పైన క్రీడాకారుల విన్యాసాలు, నీళ్లలో ఈతగాళ్ల ఫీట్స్ చూశారా? ఇప్పుడు అంతరిక్షంలో కూడా అలాంటి పోటీలే జరిగాయి. ఆస్ట్రోనాట్స్ ఒకరితో ఒకరు పోటీపడుతూ గేమ్స్ ఆడారు.

జపాన్ టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఆటగాళ్ళు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి పతకాలు సొంతం చేసుకోగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో ఉన్న వ్యోమగాములు కూడా తమ స్వంత ‘స్పేస్ ఒలింపిక్స్’ ను సృష్టించారు. అంతరిక్షంలో మనుషులే గాల్లో తిరుగాడుతుంటారు. అలాంటిది ఆటలు ఎలా ఆడుతారని అనుకుంటున్నారా? అయితే అలాంటి సందేహాం అవసరం లేదు. అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌లో ఆస్ట్రోనాట్స్ గేమ్స్ ఆడుతున్న వీడియో నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలిచింది. జీరో గ్రావిటీ‌లోనూ వ్యోమగాములు జిమ్నాస్టిక్స్‌, నో హ్యాండ్‌బాల్‌, వెయిట్‌లెస్‌ షార్ప్‌ షూటింగ్ వంటి గేమ్స్ ఆడి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు. బాల్‌ను పట్టుకునేందుకు వాళ్లు పడుతున్న కష్టాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఈ ఒలింపిక్స్‌ వేడుకలకు ముగింపు కార్యక్రమం కూడా నిర్వహించడం విశేషం. జపనీస్ వ్యోమగామి అకిహికో హోషైడ్, పెస్క్వెట్ టోక్యో ఒలింపిక్స్ 2020 జెండాను చూపించడంతో పాటు దాని వెనక వైపు 2024 పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌ను రిప్రజెంట్ చేశారు.

Advertisement

Next Story