- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమంత- చైతన్య డివోర్స్.. నిజమైన జ్యోతిష్యుడి మాటలు.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన సమంత- చైతన్య విడాకుల మిస్టరీ వీడింది. ఎట్టకేలకు ఆ ప్రేమ జంట విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ దారులు వేరని, అయినా తమ మధ్య ఉన్న స్నేహ బంధం ఎప్పుడు అలాగే ఉంటుందని తెలిపారు. ఇక ఈ ఘటనతో గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని తేలిపోయింది. దీంతో ప్రస్తుతం మరోసారి వేణు స్వామి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఒక ఇంటర్వ్యూ లో వేణు స్వామి మాట్లాడుతూ.. ” సమంత- నాగ చైతన్య విడిపోతారని నాకు మూడేళ్ళ క్రితమే తెలుసు.. నాగ చైతన్య, సమంత జాతకం నా దగ్గర ఉంది. మూడేళ్ల క్రితమే వీళ్ల గురించి నాగరాజు ఇంటర్వ్యూలో చెప్పాను. వీళ్ల మ్యాటర్ నేను చెప్పినట్టుగా సీరియస్‌గానే ఉంది. సమంత జాతకాన్ని బట్టి.. ఆమె వివాహ బంధం ఎక్కువ కాలం నిలవదు. నాగచైతన్య-సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను. ఎలాంటి సమస్యలు అంటే వాళ్లిద్దరి మధ్య గ్యాప్ రావచ్చు.. విడిపోవచ్చు.. సంతానం కలగకపోవచ్చు.. పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు వస్తాయి. సమంత అమావాస్య నాడు పుట్టింది.. దాని వల్ల చైతూకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది విశ్లేషించి చెప్పాను. సినిమాల పరంగా వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. బాగా రాణిస్తారు.. పెళ్లి చేసుకున్నా సమంత సినిమాల్లో కంటిన్యూ అవుతుంది’ అని ఇంటర్వ్యూ లో తెలిపాడు.
ప్రస్తుత పరిస్థితిని బట్టి వేణు స్వామి చెప్పిన మాటలు పొల్లుపోకుండా జరిగినట్లు కనపడుతోంది. ఎంతో ప్రేమగా పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు అన్యోన్యంగా కలిసి ఉండి ఇప్పుడు విడిపోతున్నారు. ఇక వీరి మధ్య విభేదాలకు కారణం కూడా సామ్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదిఏమైనా తమ అభిమాన జంట విడిపోవడం అభిమానులకు మింగుడుపడడం లేదన్న మాట వాస్తవమని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది
- Tags
- Divorce