- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లంచం కొట్టు.. ఇళ్లు కట్టు.. ఓ సర్పంచ్ నిర్వాకం…
దిశ, జగిత్యాల : అవినీతికి కాదేవరు అనర్హం అన్నట్లుగా తయారైంది మన రాష్ట్రంలోని పరిస్థితులు. ప్రతినిత్యం సర్కార్‌తో ఏదో పని పడే సామాన్యుడికి, అధికారులు, నేతలు చేస్తున్న లంచాల డిమాండ్లతో తలపట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా తన ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం ఓ సర్పంచ్ డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడని ఓ బాధితుడి ఆవేదన. జగిత్యాల రూరల్ మండలం హస్నాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని తన భూమిలో కోటగిరి మోహన్ ఇల్లు నిర్మాణం కొరకు ఆన్లైన్ పర్మిషన్ తీసుకున్నారు. గ్రామ సర్పంచ్, నా అనుమతి లేనిదే ఇంటి నిర్మాణం ఎలా జరుగుతుందని, 24 వేలు ఇస్తేనే ఇంటి నిర్మాణం జరుగుతుందని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ.. నేను కూడా తెలంగాణ ఉద్యమం నుండి పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్ననాని, సొంత పార్టీ కార్యకర్తలనే లంచం కొరకు సర్పంచ్ వేధిస్తున్నారని అన్నారు. మొదట యాభై వేలు డిమాండ్ చేశాడని, తరువాత ఇరవై 24 వేలు ఇస్తేనే ఇంటి నిర్మాణం జరుగుతుందని, ఇవ్వకుంటే కట్టిన ఇల్లును జేసిబితో కూల్చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా ద్వారా కోరినా స్పందన కరువైందన్నారు.
ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వకూడదని, బీ పాస్ ద్వారా ఆన్లైన్ పర్మిషన్ తీసుకుంటే సరిపోతుందని చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు కార్యకర్తలను కూడా పీడిస్తున్నా పట్టించుకున్న వారు లేరని ఇలాగే ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని అన్నారు. గ్రామ కార్యదర్శి కూడా సర్పంచుకు తొత్తుగా మారారని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన స్పందన లేదని అన్నారు. జిల్లా అధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నా స్థలంలో ఏదైనా నిర్మాణం జరిగితే చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు ప్రభుత్వం రక్షణ కలిపించాలని వేడుకున్నారు.