మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై రాళ్ల దాడి

by Shiva |
మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై రాళ్ల దాడి
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై పశ్చిమ బెంగాల్‌లో రాళ్లతో దాడి చేశారు. గత ఏడాది క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అశోక్ దిండా రాజకీయాల్లోకి వచ్చాడు. బీజేపీ ఆయనకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించింది. ప్రచారంలో భాగంగా ఈస్ట్ మిడ్నాపూర్ ప్రాంతంలో పర్యటిస్తుండగా ఆయనపై గుర్తుతెలియని కొంత మంది గుంపు దాడికి పాల్పడ్డారు. అతడు కారులో వెళ్తుండగా దాదాపు 50 మంది కలసి రాళ్లు రువ్వినట్లు సమాచారం.

ఈ ఘటనలో దిండాకు తీవ్ర గాయాలయ్యాయి. మొయినా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తృణమూల్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంగ్రామ్ కుమార్ డోలాయిపై అశోక్ దిండా పోటీ చేస్తున్నాడు. ఆయన అనుచరులు, టీఎంసీ కార్యకర్తలే అతడిపై దాడి చేసినట్లు బీజేపీ ఆరోపిస్తున్నది. కాగా, దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం అతడికి వై-కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. దిండా టీమ్ ఇండియా తరపున 13 వన్డేలు, 9 టీ20మ్యాచ్‌లు ఆడాడు.

Advertisement

Next Story