ధోనీ రికార్డు సమం చేసిన అస్గర్

by Shiva |
ధోనీ రికార్డు సమం చేసిన అస్గర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ సమం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఎంఎస్ ధోనీకి విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు ఉన్నది. ధోనీ 72 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించి 41 మ్యాచ్‌లలో భారత జట్టుకు విజయాలు అందించాడు. ఇప్పుడు అస్గర్ ఈ రికార్డును సమం చేశాడు. అస్గర్ కేవలం 51 మ్యాచ్‌లలోనే 41 విజయాలు అందించి రికార్డు సృష్టించాడు.

విజయాల శాతం పరంగా ధోనీ 59.28గా ఉండగా.. అస్గర్ మాత్రం 81.37 శాతం నమోదు చేశాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జింబాబ్వేతో జరుగులున్న రెండో టీ20లో అస్గర్ ఈ రికార్డును సమం చేశాడు. చివరిగా మిగిలిన 3వ టీ20లో కూడా విజయం సాధిస్తే ధోనీ రికార్డును అధిగమిస్తాడు.

Advertisement

Next Story