ముస్లింల ఇళ్లపై త్రివర్ణ పతాకం ఎగరేయండి

by srinivas |
ముస్లింల ఇళ్లపై త్రివర్ణ పతాకం ఎగరేయండి
X

దిశ, గుంటూరు :
ఏపీలోని గుంటూరు జిల్లాలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 1నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఎన్‌పీఆర్‌ను ఏపీ ప్రభుత్వం అమలు చేయవద్దని ఓవైసీ జగన్ ప్రభుత్వాన్నికోరారు. దానిపై స్టే విధించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన వారి ఫొటోలను చూపి ముస్లిముల మీద దాడులు చేస్తున్నారని, దేశంలో హిందూవులకు, ముస్లిములకు మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ఎన్పీఆర్‌లో భాగంగా ఎవరైనా మీ వివరాలు కోరితే భారతీయులమని బదులివ్వాలని ఓవైసీ ముస్లిములకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. ప్రస్తుతం ముస్లిములు ఒంటరి జీవితం గడుపుతున్నారని సభకు విచ్చేసిన ప్రజలనుద్దేశించి అసద్ వ్యాఖ్యలు చేశారు.

tags ; caa, npr, guntur, anti caa meet, asaduddin owaisi, cm jagan

Advertisement

Next Story