- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టుల వృత్తి ఎంతో గొప్పది
దిశ, ఆందోల్: నేటి సమాజంలో జర్నలిస్టుల వృత్తి ఎంతో గొప్పదని, రోజూ సమాచారాన్ని సేకరించి ప్రజలకు తెలియజేసేది ఒక జర్నలిస్టులేనని సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూకంటి లక్ష్మణ్ గుప్త, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.మల్లికార్జున్ గుప్తలు అన్నారు. జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా ఆదివారం జోగిపేటలోని వాసవి కళ్యాణ మండపంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ వాసవి క్లబ్‌ల ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్, మల్లికార్జున్‌లు మాట్లాడుతూ… కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలోనూ భయపడకుండా ఎప్పటికప్పుడు వార్తలు సేకరించి ప్రజలకు తెలియజేశారని కొనియాడారు. ప్రజల కోసం రోజు పనిచేసే జర్నలిస్టులకు నేటికీ ఉద్యోగ భద్రత లేక, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టుల అందరికీ కనీస గౌరవ వేతనాలు అమలు చేసి అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు ఉద్యోగ విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు.