‘గొర్రెకుంట’ ఘటనలో నిందితుడు అరెస్ట్

by Sumithra |   ( Updated:2020-05-25 07:41:19.0  )
‘గొర్రెకుంట’ ఘటనలో నిందితుడు అరెస్ట్
X

దిశ, వరంగల్: రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని బావిలోని శవాల మిస్టరీకి తెరపడింది. నిందితున్ని పట్టుకోవడంలో వరంగల్ పోలీసులు సఫలం అయ్యారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 72 గంటల్లో నిందితున్ని పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు విలేకర్ల ముందు హాజరు పర్చారు. అనంతరం వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ విలేకరుల సమావేశంలో నేరస్థుడి వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకూ దొరికిన ఆధారాల ప్రకారం.. ప్రధాన నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ ఒక్కడే ఈ హత్యలు చేసినట్టు సీపీ వెల్లడించారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మిగతా తొమ్మిదిమందిని హత్య చేసినట్టు తెలిపారు. ఒకేరోజు 9 మందిని చంపేసి ఎవరికీ తెలియకుండా ఊరి చివర బావిలో పడేశాడు. దీనిని పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఛేదించారు.

Advertisement

Next Story