- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్‌ఖైదా ముఠా గుట్టురట్టు.. ఆగస్టు 15న పేలుళ్లకు కుట్ర!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అల్‌ఖైదా ముఠా గుట్టురట్టయింది. అల్‌ఖైదాతో సంబంధాలు పెట్టుకుని ఇక్కడ పేలుళ్లకు పాల్పడటానికి ప్రణాళికలు వేసినట్టుగా భావిస్తున్న ఓ బృందాన్ని యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్)లు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నివాసాల్లో ఆకస్మికంగా చేసిన తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు, పిస్టళ్లు దొరికాయి. రెండు ప్రెషర్ కుక్కర్లు, టైమ్ బాంబులు, పిస్టళ్లు, ఇతర పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర్యదినోత్సవాన పలునగరాల్లో ఉగ్రవాదులు పేలుళ్లకు ప్లాన్ వేశారని ఏడీజీ ప్రశాంత్ కుమార్ వివరించారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో నుంచి ఉమర్ హల్మండీ అనే ఉగ్రవాది లక్నోలో యువతను ఉగ్రవాదంలోకి రిక్రూట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఏటీఎస్‌కు సమాచారమందింది. కొంతమంది పేదలనూ గుర్తించి ర్యాడికలైజ్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో లక్నోలోని కకోరి ఏరియాలో ఏటీఎస్ నిఘా పెంచింది. కొంతకాలంగా ఓ ఇంటికి తరుచూ అపరిచిత యువకులు వస్తుండటం ఈ అనుమానాలను బలపరిచాయి. ఉగ్రవాదానికి సంబంధించి పక్కా సమాచారం లభించగానే ఏటీఎస్ అధికారులు ఆదివారం ఇద్దరు వ్యక్తులు మిన్హాజ్ అహ్మద్, మసీరుద్దీన్‌ల నివాసాల్లో దాడులు చేశారు. మిన్హాజ్ ఇంట్లో తుపాకి, పేలుడు పదార్థాలు లభించాయి.
జాన్‌పురి జిల్లాలో మరియహు టౌన్‌లోని మసీరుద్దీన్ నివాసంలో మరో బృందం తనిఖీలు చేయగా, పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు, కుక్కర బాంబులు, నాటు బాంబులు దొరికాయి. పెద్ద ఉగ్రవాద ముఠాను బట్టబయలు చేశామని, అల్‌ఖైదా అనుబంధ అన్సర్ గజవట్ ఉల్ హింద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి ప్రశాంత్ కుమార్ వివరించారు. పేషావర్, క్వెట్టాల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను ఇక్కడ నడిపిస్తున్నారని అన్నారు. ఈ ముఠా ఆత్మాహుతి దాడులు, సహా ఇతర పేలుళ్లకు ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు.