డబ్బులు లేవని ఏకంగా హత్య చేశాడు

by Shyam |

దిశ, క్రైమ్ బ్యూరో: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్‌సాగర్ వద్ద జరిగిన సత్యనారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా.. హత్య చేసింది రాజేంద్రనగర్‌ దర్గా ఖాలీజ్ ఖాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అజీజ్‎(పాత నేరస్థుడు)గా గుర్తించారు. లాక్‎డౌన్ కారణంగా ఎలాంటి పనులు లేకపోవడంతో.. చేతి ఖర్చుల కోసం దొంగతనాలు చేయాలని భావించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే మే నెలలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదును దొంగిలించేందుకు ప్రయత్నం చేసి అజీజ్ విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైన డబ్బు సంపాధించాలన్న దురాశతో.. ఈ నెల 6వ తేదీన కల్లు కాంపౌండ్‎లో పరిచయమైన సత్యనారాయణను మాయమాటలు హిమాయత్‎సాగర్‎లోని ఎవరూ ఉండని ప్రాంతానికి తీసుకెళ్లాడు. సత్యనారాయణను అక్కడే హత్య చేసిన అజీజ్ మృతుని వద్ద లభించిన రూ.4 వేలు తీసుకొని వెళ్ళాడు. ఈ కేసు విచారణలో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, లంగర్ హౌజ్ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‎కు తరలించారు.

Advertisement

Next Story