బ్లాక్ మెయిల్ చేసిన యూట్యూబ్ నిర్వాహకుల అరెస్ట్

by Sumithra |
బ్లాక్ మెయిల్ చేసిన యూట్యూబ్ నిర్వాహకుల అరెస్ట్
X

దిశ, జవహర్ నగర్: బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన యూట్యూబ్ నిర్వాహకులు అరెస్టయిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బిక్షపతి రావు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం, నాగారం మున్సిపాలిటీ పరిధి, బాపూజీనగర్‌కు చెందిన పాము అఖిల్(24), వాయుశక్తి నగర్ కు చెందిన చరణ్‌కు పరిచయస్తుడు. గత నెల 30 న ఓ విషయంలో చరణ్‌‌పై కేసు నమోదు అయింది.

అదే రోజున రాజ్‌ కుమార్ అనే వ్యక్తి తన మొబైల్ నుంచి పాము అఖిల్ బావ అయిన భాస్కర్ కు ఫోన్ చేసి అఖిల్ కూడా చరణ్‌తో పాటు నేరంలో పాల్గొన్నారని బెదిరింపులకు పాల్పడ్డాడు. దానికి ఆధారాలు యూట్యూబ్‌ ఉన్నాయని అయితే వాటిని డిలీట్ చేస్తామని అందుకు రూ. 50 వేలు డిమాండ్ చేస్తూ బోగారానికి రమ్మని భాస్కర్‌ను అఖిల్‌ను పిలిచాడు. అక్కడ రాజ్ కుమార్ అఖిల్‌ను బెదిరించి రూ.10 వేలు తీసుకుని, ఇతర జర్నలిస్టులకు ఇవ్వడానికి ఎక్కువ డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశాడు.

ఈ నెల 2వ తేదీన రాజ్ కుమార్ అఖిల్ కు ఫోన్ చేసి పద్మశాలి వెంచర్‌కు పిలిచాడు. తన బ్యాంక్ పాస్‌బుక్‌ను అఖిల్ కు ఇచ్చి బ్యాంకులో డబ్బు జమ చేయాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వనందుకు రాజ్ కుమార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఈ నెల 3న నోబుల్ స్కూల్ సమీపంలో అఖిల్ ను అడ్డుకుని కొట్టి అతని వన్ ప్లస్ 7 ప్రో మొబైల్ తీసుకున్నారు. దీంతో అఖిల్ ఫిర్యాదు మేరకు బ్లాక్ మెయిల్ చేసిన యూట్యూబ్ నిర్వాహకులైన రాజ్ కుమార్, యాదగిరి లను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Next Story

Most Viewed