- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్మూర్ రైతులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలి
దిశ, నిజామాబాద్ :
ఆర్మూర్ రైతులు రాష్ట్రంలోని ఇతర ప్రాంత రైతులకు ఆదర్శవంతంగా నిలిచేలా పంటలు పండించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పిప్రీ గ్రామంలో వ్యవసాయ శాఖ లాభసాటి వ్యవసాయంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.వానాకాలం పంట ప్రణాళికలు తయారయ్యాక రైతుబంధు వస్తదా, రాదా అన్న సందేహం రైతుల్లో కలుగుతోందని, దానికి వానకాలం సాగు ప్రణాళికకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పంటసాగు విధానం వలన రానున్న రోజుల్లో రైతు స్థాయి పెరగాలనే కోరిక తప్ప తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. వానకాలంలో డిమాండ్ ఉన్న పంటలు వేయడం వలన మార్కెట్‌లో సులువుగా అమ్ముకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు.మన జిల్లాలో ఆరు నియోజకవర్గాలైన బోధన్, బాన్సువాడ ఏరియాల్లో సన్న రకాలు ఎక్కువ పండిస్తున్నారని, నిజామాబాద్ రూరల్‌లో దొడ్డు రకాలు పండిస్తున్నారని, బాల్కొండలో మిక్స్‌డ్ పంటలు పండిస్తున్నారని, బాన్సువాడ, బోధన్ ఏరియాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయి నెల రోజులు అవుతుందని, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్లో ఇంకా కొనుగోలు జరుగుతుందన్నారు. దానికి కారణం సన్న బియ్యానికి డిమాండ్ ఉండటమే అని చెప్పారు. రైతు క్షేమం కోరి దొడ్డు రకాలు మొత్తం ప్రభుత్వమే కొన్నదని, ప్రభుత్వము ద్వారా ఖర్చు చేసిన డబ్బు ప్రజలదే అన్నారు. మనం డిమాండ్ లేని పంటలను పండిస్తూ పోతే ఆ పంట కొని ఏం చేయాలి అని ప్రశ్నించారు. రేషన్ షాపుల ద్వారా తెల్ల కార్డు ఉన్న వారికి రూ.కిలో చొప్పున బియ్యం ఇస్తున్నామన్నారు.ఒక కిలో బియ్యంపై ప్రభుత్వం రూ.27 ఖర్చు చేస్తున్నదని కలెక్టర్ వివరించచారు. అయితే వాటిని కొంత మంది మాత్రమే తింటున్నారని, మిల్లర్స్ కొన్ని రకాల బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని దేశాలు బియ్యంలో రసాయన ఎరువుల శాతం పరిశీలించి కొంటున్నారని, అందుకే రానున్న రోజుల్లో వ్యవసాయ విధానం మారబోతుందని తేల్చి చెప్పారు.ఆర్గానిక్ పంటలు ఎక్కువ పండించాలని, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు. డిమాండ్ ఉన్న పంటలు పండించడం వలన రైతాంగానికి మార్కెట్ ఇబ్బంది ఉండదని, వారు పండించిన పంటలను త్వరగా అమ్ముకునే అవకాశం కలుగుతుందన్నారు.కార్యక్రమంలో జెడీఎ గోవింద్, ఏఓ హరికృష్ణ, ఎంపీడీవో గోపి బాబు, సింగిల్విండో చైర్మన్ హేమంత్ రెడ్డి, ఎంపీటీసీ సురేష్, తహశీల్దార్ సంజయ్ రావు పాల్గొన్నారు.