సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అరియానా…

by Shyam |
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అరియానా…
X

దిశ, సినిమా : పాప్ సింగర్ అరియానా గ్రాండే సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుంది. డిశంబర్‌లో తన బాయ్ ఫ్రెండ్‌, రియల్ ఎస్టేట్ ఏజెంట్ డాల్టన్ గోమెజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అరియానా.. ఎలాంటి ఇన్‌ఫర్మేషన్ లేకుండానే పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. కాలిఫోర్నియా మాంటెసిటోలోని తన సొంత ఇంట్లోనే 20 మంది సమీప బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకోగా.. లాస్ట్ వీకెండ్ పెళ్లి అయినట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత క్లోజ్ అండ్ రొమాంటిక్ పిక్స్‌తో నెట్టింట్ల ట్రెండ్ అయిపోయిన ఈ యంగ్ కపుల్.. మ్యారేజ్ చేసుకున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఈ విషయం ప్రకటించకపోవడంపై ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. కాగా కమెడియన్ ప్యాట్ డేవిడ్సన్‌తో డేటింగ్‌లో ఉందని, పెళ్లి చేసుకుంటారని అనుకున్న సమయంలో డాల్టన్‌తో రిలేషన్‌షిప్‌ గురించి తెలిపింది అరియానా.

Tags:
slug:

Advertisement

Next Story