- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జూన్ 30న ఆర్టీసీ వెబ్‌సైట్ సేవలు బంద్
by srinivas |
X
దిశ, అమరావతి: ఆన్‌లైన్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఏపీఎస్ ఆర్టీసీ ఆధునీకరిస్తోంది. అన్ని బస్సుల్లో రిజర్వేషన్ టికెట్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. నగదు రహిత, కాంటాక్ట్ లెస్ టికెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వినూత్న సేవలతో ఆధునాతన రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించేలా ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. ఒకేసారి 50 వేల మంది సేవలు పొందేలా వెబ్‌సైట్‌ను ఆధునీకరణ చేస్తుండటంతో ఈ నెల 30న సర్వర్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. దీంతో ఈ నెల 30న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆర్టీసీ వెబ్‌సైట్ నిలిచిపోనుంది. ఆ సమయంలో టికెట్ బుకింగ్‌లు, రద్దు సౌకర్యం ఉండబోదని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Advertisement
Next Story