ఏ నెలలో ఏ పథకం.. ఏపీ ప్రభుత్వం క్యాలెండర్

by srinivas |   ( Updated:2021-04-13 00:36:34.0  )
ఏ నెలలో ఏ పథకం.. ఏపీ ప్రభుత్వం క్యాలెండర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం ముందే ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సంక్షేమ క్యాలెండర్‌ను ఇవాళ విడుదల చేశారు. ఈ క్యాలెండర్‌లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం డబ్బులను జమ చేస్తామనే విషయాన్ని ప్రకటించింది.

ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన మొదటి విడత, జగనన్న విద్యాదీవెన ఒకటో విడత, రైతులకు సున్నా వడ్డీ రబీ 2019, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాలను అమలు చేస్తామంది. మేలో ఉచిత పంటల బీమా, రైతు భరోసా తొలి విడత, మత్స్యకార భరోసా.. జూన్‌లో జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ చేయూత పథకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

జులైలో జగనన్న విద్యాదీవెన రెండో విడత, వైఎస్సార్ వాహనమిత్ర, వైఎస్సార్ కాపునేస్తం..ఆగష్టులో వైఎస్సార్ సున్నా వడ్డీ ఖరీప్ 2020, ఎంఎస్‌ఎంఈ స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు, వైఎస్సార్ నేతన్న నేస్తం, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేస్తామంది. సెప్టెంబర్‌లో వైఎస్సార్ ఆసరా.. అక్టోబర్‌లో రైతుభరోసా రెండో విడత, జగనన్న చేదోడు, జగనన్న తోడు పథకాలను అమలు చేస్తామంది.

నవంబర్‌లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం.. డిసెంబర్‌లో జగనన్న వసతి దీవెన రెండో విడత, విద్యాదీవెన రెండో విడత, వైఎస్సార్ లా నేస్తం పథకాలను అమలు చేస్తామంది. ఇక వచ్చే ఏడాది జనవరిలో రైతు భరోసా మూడో విడత, జగనన్న అమ్మఒడి, పెన్షన్ రూ.2,500 పెంపు కార్యక్రమాలను చేపడతామంది. ఇక ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన నాలుగో విడత డబ్బులు జమ చేస్తామంి.

Advertisement

Next Story

Most Viewed