పీపీపీ పద్ధతిలో 5 స్టార్, 7 స్టార్ హోటళ్లు : అవంతి శ్రీనివాస్

by Anukaran |   ( Updated:2020-07-14 10:04:33.0  )
పీపీపీ పద్ధతిలో 5 స్టార్, 7 స్టార్ హోటళ్లు : అవంతి శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గత మార్చి నెల నుంచి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మూసివేశామని అన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తిరిగి పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమతిస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా కారణంగా పర్యాటక రంగానికి నెలకు రూ.10 కోట్ల చొప్పున నేటి వరకూ రూ.60 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. మరో 15 రోజుల్లో పర్యాటక ప్రాంతాల్లో మరమ్మత్తులు ఏమైనా ఉంటే పూర్తి చేసి, ఆగస్టు ఒకటో తేదీ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేసారు. పర్యాటకాభివృద్ధిపై మరో వారం రోజుల్లో 13 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణాలో పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేసారు. అంతే కాకుండా రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికై 7 చోట్ల 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల ఏర్పాటును పీపీపీ పద్ధతిలో నిర్మిస్తామన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి రాష్ట్రంలో ప్రముఖుల జయంతులు, వర్థంతులను జరుపుతామని వివరించారు. విశాఖ జిల్లాలో ఏర్పడే కొత్ల జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని చెప్పుకొచ్చారు. సమావేశంలో టూరిజం, శిల్పారామం, సాంస్కృతిక శాఖాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed