‘మంత్రి పెద్దిరెడ్డిని దూరంగా ఉంచాలి’

by srinivas |
‘మంత్రి పెద్దిరెడ్డిని దూరంగా ఉంచాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పెద్దిరెడ్డిని అధికారానికి దూరంగా ఉంచాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జడ్జి రామకృష్ణ ను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జడ్జి ఇంటి నుంచి బయటకు రాకుండా 145 ప్రొసీడింగ్స్ ఇచ్చారని మండిపడ్డారు. శనివారం చిత్తూరు జిల్లా బి. కొత్తకోటలోని జడ్జి రామకృష్ణ నివాసానికి వెళ్లిన శైలజానాథ్ పరామర్శించారు. ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి, ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

పెద్దిరెడ్డి పై ఎన్ని ఆరోపణలు వచ్చిన సీఎం జగన్ చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల పై దాడులు పెరిగాయన్నారు. ఈ దాడుల వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని శైలజానాథ్ ఆరోపించారు. న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని.. బీజేపీ, జనసేన, వైసీపీ నాయకులు కుమ్మక్కు అయ్యారంటూ శైలజానాథ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

Next Story