- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు.. టీఆర్ఎస్ లీడర్లకు మంత్రి అనిల్ కౌంటర్
దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణ మంత్రులపై ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్న తరుణంలో తెలంగాణ మంత్రులు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం పద్ధతి కాదన్నారు. తమ నాయకుడు వైఎస్ఆర్‌పై చేస్తున్న విమర్శలు, దూషణలను తెలంగాణ మంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తాము కూడా అలా మాట్లాడగలమని అయితే సామరస్యంగా పరిష్కరించుకుందామని సీఎం జగన్ అన్నందువల్ల మాట్లాడటం లేదన్నారు. మరోవైపు ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం సక్రమమే అని, తెలంగాణ ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు. తాము అక్రమంగా ఏ ప్రాజెక్టులూ నిర్మించడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణలో పాలమూరు డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులు అక్రమంగా నిర్మించినా నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. జల వివాదాలు సామరస్యంగా చర్చిస్తేనే పరిష్కరామవుతాయని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు.