మండలి చైర్మన్ వర్సెస్ కార్యదర్శి..

by srinivas |
మండలి చైర్మన్ వర్సెస్ కార్యదర్శి..
X

ఏపీలో శాసన మండలి రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి.మండలి కార్యదర్శికి,చెర్మన్‌కు మధ్య వివాదం ముదురుతోంది.తాజాగా కార్యదర్శిని మండలి చైర్మన్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సచివాలయ ఉద్యోగులు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉండగా రెండ్రోజుల కిందట సెలక్ట్ కమిటీకి సిఫారసు చేసిన ఫైళ్లను అసెంబ్లీ కార్యదర్శి రెండుసార్లు తిప్పి పంపించారని మండలి చైర్మన్ షరీఫ్ ఏపీ గవర్నర్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కాగా,మండలి కార్యదర్శికి తాము అండగా ఉన్నామని, అవసరమైతే చైర్మన్ తీరుపై గవర్నర్‌కు కలిసి ఫిర్యాదు చేస్తామని సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు పేర్కొనడం గమనార్హం.

Advertisement

Next Story