- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏపీ నేత ఓపెన్ సవాల్..
కర్నూలు : బీజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఏపీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు రజాక్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు రజాక్ సవాల్ విసిరారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తనను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాడ్డుతున్నారంటూ చేసిన ఆరోపణలు నిరూపించగలవా? అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రాజాసింగ్ తాను చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.
మల్లికార్జునస్వామిని ఏ మతం వారైనా పూజించవచ్చునని అన్నారు. అలా పూజించకూడదని మీ మత గ్రంధంలో ఏమైనా రాశారా? లేకపోతే రాజ్యాంగంలో రాశారా? అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను రజాక్ నిలదీశారు. శ్రీశైలం దేవస్థానంలో తన పేరుమీద పైసా పని కూడా తాను చేయలేదని స్పష్టం చేశారు. తన ముస్లిం సోదరులకు కూడా దేవస్థానంలో ఎలాంటి కాంట్రాక్టులు కూడా ఇప్పించలేదని రజాక్ తేల్చి చెప్పారు. ఆరోపణలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని రాజాసింగ్‌కు రజాక్ హితవు చెప్పారు.