ఏపీ ఉన్నత విద్యా మండలి సంచలన నిర్ణయం

by srinivas |
ఏపీ ఉన్నత విద్యా మండలి సంచలన నిర్ణయం
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యామండలి ప్రతీ ఏడాది ఇంటర్ మార్కులు ఆధారంగా ఈఏపీసెట్‌లో 25శాతం వెయిటేజ్ ఇస్తుంటుంది. అయితే కొవిడ్ కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఈ ఏడాది వెయిటేజ్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వందశాతం ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే విద్యాసంస్థల్లో ప్రవేశాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌, ఫార్మా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Next Story