హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

by srinivas |
ap-highcourt 1
X

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్ రద్దు చేయాలని తీర్పునిచ్చింది. మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే పవర్ ప్రాజెక్ట్ టెండర్లు కేంద్ర విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని, చట్టవిరుద్దంగా ఉన్నాయని టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

ఒప్పందంలో వివాదం వస్తే నియంత్రణ మండలి కాకుండా ప్రభుత్వమే సమస్యను పరిష్కరించేలా ఉందని, ఇది టెండర్ మార్గదర్శకాలకు విరుద్దమని టాటా ఎనర్జి తెలిపింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు.. అనంతరం టెండర్ రద్దు చేయాలని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed