బిగ్ బ్రేకింగ్: ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు చేసిన హైకోర్టు: High Court Cancels MPTC ZPTC 2021 Elections

by Anukaran |   ( Updated:2021-05-21 04:25:51.0  )
బిగ్ బ్రేకింగ్: ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు చేసిన హైకోర్టు:  High Court Cancels MPTC ZPTC 2021 Elections
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీపీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పరిషత్ ఎన్నికల రద్దు చేస్తూ.. ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపలేదని స్పష్టం చేసిందని తీర్పులో పేర్కాన్నారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను స‌వాల్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ ను ఫాలో కాకుండా ఎన్నిక‌లు జ‌రిగాయ‌న్న ప్రతిప‌క్షాల వాద‌న‌కు హైకోర్టు మొగ్గుచూపింది.

కాగా, గత నెల ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ.. అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. 2020లో ఎన్నికలు ఎక్కడ నిలిచిపోయాయో.. అక్కడి నుంచే తిరిగి ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 8న ఎన్నికలు జరిగాయి. అదే నెల 10వ తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు కౌంటింగ్‌పై స్టే విధించింది. ఈ నేపథ్యంలో జనసేన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో కొత్త నోటిఫికేషన్‌కు చాలా సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story