- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో రుతుపవనాలు ఏపీ, తెలంగాణలో పూర్తిగా విస్తరించనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రుతుపవనాలు ఇప్పటివరకు మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో మాత్రమే ప్రవేశించాయి. మరోవైపు మరఠ్వాడా నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్రమట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ వరకు ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. అయితే ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నందున రుతుపవనాలు వేగం పుంజుకోవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ కారణంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వెల్లడించింది.
Advertisement
Next Story