జూడాలకు జగన్ సర్కార్ గుడ్‌‌న్యూస్..

by Anukaran |   ( Updated:2020-08-12 10:24:54.0  )
జూడాలకు జగన్ సర్కార్ గుడ్‌‌న్యూస్..
X

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. జూడాలకు ఇచ్చే స్టైఫండ్‌ను పెంచుతూ బుధవారం సీఎం జగన్ ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా జారీఅయిన ఉత్తర్వుల ప్రకారం.. ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రూ.19,589, పీజీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు రూ.44,075, పీడీ డిగ్రీ సెకండియర్ విద్యార్థులకు రూ.46,524, పీడీ డిగ్రీ థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973..

పీజీ డిప్లమా ఫస్టియర్ విద్యార్థులకు రూ.44,075, పీజీ డిప్లమా సెకండియర్ విద్యార్థులకు రూ. 46,524.. సూపర్ స్పెషాలిటీ ఫస్టియర్ విద్యార్థులకురూ.48,973, సెకండియర్ విద్యార్థులకు రూ.51,422, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.53,869.. ఎండీఎస్ ఫస్టియర్ విద్యార్థులకు రూ.44,075, సెకండియర్ విద్యార్థులకు రూ.46,524, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973 స్టైఫండ్‌ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల జూడాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story