- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్రంట్‌లైన్ వారియర్స్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, ఏపీ బ్యూరో: ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్ల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ను నెరవేర్చింది. కొవిడ్‌తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కొవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబానికి రూ.25 లక్షలు.. స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు, ఎంఎన్‌వో లేదా ఎఫ్‌ఎన్‌వోలకు రూ.15లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఇతర వైద్య సిబ్బంది చనిపోతే రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందేలా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు ఏర్పాట్లు చెయ్యాలని ప్రభుత్వం కోరింది. గుర్తింపు కార్డుతో పాటు, కొవిడ్-19 పాజిటివ్ సర్టిఫికేట్,డెత్ సర్టిఫికెట్ సమర్పించి ఈ ఎక్స్‌గ్రేషియాకు కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.