జగన్ కొత్త పథకం 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' ప్రారంభం

by srinivas |
జగన్ కొత్త పథకం వైఎస్సార్ మత్స్యకార భరోసా ప్రారంభం
X

దిశ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కొత్త పధకానికి శ్రీకారం చుట్టారు. కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్‌తో పాటు మే, జూన్ నెలల్లో చేపల వేటపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఉపాధికోల్పోయిన మత్స్య కారులను ఆదుకునేందుకు వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని తీసుకొచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పథకాన్ని జగన్ ప్రారంభించారు.

జగన్ బటన్ నొక్కగానే మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమయ్యాయి. ఈ పథకం ద్వారా లక్షా తొమ్మిది వేల 231 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి చాలా కష్టాలు ఉన్నాయని, మత్స్యకారుల కష్టాలు మరింత పెద్దవిగా భావించడం వల్లే వారికి సాయం చేస్తున్నామని అన్నారు.

వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునే నిమిత్తం ఈ పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. అలాగే వేట సమయంలో ఏదైనా జరిగితే ఎక్స్ గ్రేషియాను 5లక్షల నుంచి 10 లక్షలకి పెంచామని అన్నారు. ఏపీలో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు కట్టబోతున్నట్టు వెల్లడించారు. ఒక ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని కట్టబోతున్నట్టు తెలిపారు. వీటికి 3 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 3 సంవత్సరాల్లో వీటి నిర్మాణాలు పూర్తిచేస్తామని ఆయన చెప్పారు.

tags: ysrcp, ys jagan, ap, ap cm, ysr matsyakara bharosa

Advertisement

Next Story

Most Viewed