హైకోర్టు లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..

by  |
ap-court
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా చికిత్స, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో కొత్త కేసులు పెరుగుతుండటం పట్ల హైకోర్టు వివరాలు అడిగి తెలుసుకుంది. అధిక కేసులు నమోదవుతున్న ఈ జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్‌పై ఆరా తీసింది. టీచర్లకు వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించింది.

సెప్టెంబరు 8 నాటికి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 45 ఏళ్లు నిండిన వారిలో 90 శాతం మందికి టీకాలు వేసినట్లు తెలిపింది. మిగిలిన వాళ్లకు వ్యాక్సినేషన్ జరుగుతోందని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలో 28 ఆక్సిజన్ ప్లాంట్లకు గాను 18 ప్లాంట్ల ఏర్పాటు పూర్తైనట్లు కేంద్రం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

Advertisement

Next Story