నవంబర్ వరకు కందిపప్పు పంపిణీ

by srinivas |
నవంబర్ వరకు కందిపప్పు పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే వెయ్యికి పైగా కరోనా క్లిష్ట సమయంలో అంబులెన్సులను ప్రారంభించి, విమర్శకుల చేత ప్రసంశలు పొందారు సీఎం జగన్. అయితే ఏపీలో పంపిణీ చేయబోయే రేషన్ సరుకుల్లో ఇకపై కందిపప్పును ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు బియ్యంతోపాటు కందిపప్పు, లేదా శనగలు ఇస్తూ వచ్చారు. ఈసారి బియ్యం మాత్రమే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి జులై నెల నుంచే నగదుకే సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే నవంబరు వరకు రేషన్ ఉచితంగా ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జులై మొదటి విడత పంపిణీలో బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేశారు. అయితే జులై 18వ తేదీ నుంచి రెండో విడత రేషన్ పంపిణీలో కందిపప్పు లేకుండా బియ్యం మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుండి నవంబర్ వరకు నెలలో ఒకసారి మాత్రమే కందిపప్పు లేదా శనగలు ఇవ్వనున్నారు, చక్కెర మటుకు ఎప్పటిలాగే నగదుకే ఇవ్వనున్నారు.

Advertisement

Next Story

Most Viewed