- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు…!
దిశ వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యార్థుల జీవన గమ్యాన్ని మార్చే ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడలో ఎంసెట్ కన్వీనర్ వి.రవీంద్ర మాట్లాడుతూ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీఎంసెట్– 2020 నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎంసెట్ పరీక్షల నిర్వహణ జరుగుతుందని ఆయన ప్రకటించారు. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రి ఇంజనీరింగ్), బీటెక్ (ఫుడ్సైన్సు టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బీవీఎస్సీ, ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఫార్మసీ, డీఫార్మా కోర్సులలోకి ఏపీ ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నామని తెలిపారు.
ఏప్రిల్ 20 నుంచి 23 వరకూ ఇంజనీరింగ్, 23, 24 తేదీల్లో అగ్రికల్చర్, 22, 23 తేదీల్లో రెండు స్ట్రీమ్ లకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. గత సంవత్సరం అమలు చేసిన నిబంధనలనే ఈ సంవత్సరం కూడా అమలు చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలు కూడా మారవని ఆయన తెలిపారు. అయితే, అభ్యర్థుల సంఖ్య పెరుగిన కారణంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి, కృష్ణా జిల్లా తిరువూరు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుల్లో కొత్త సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్లో మూడు పరీక్షా కేంద్రాలు ఉంటాయని, విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు కాల్ సెంటర్లను సైతం ఏర్పాటు చేశామని ఆయన ప్రకటించారు. ఈ నెల 29 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ఆయన తెలిపారు. అంటే నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు మార్చి 29 అని తెలిపారు. రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 5 వరకూ, రూ. 1000 రుసుముతో 10వ తేదీ వరకూ, రూ. 5 వేల రుసుముతో 15వ తేదీ వరకూ, రూ. 10 వేల ఆలస్య రుసుమును చెల్లించి ఏప్రిల్ 19వ తేదీ వరకూ దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించామని ఆయన వెల్లడించారు.
ఏప్రిల్ 16 నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ప్రతి రోజూ రెండు సెషన్లుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయని, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షలు రెండింటికీ హాజరు కావాలని భావించే వారు రూ. 1000 చెల్లించాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు https://sche.ap.gov.in/APSCHEHome.aspx వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.