రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు 

by srinivas |
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు 
X

దిశ, ఏపీ బ్యూరో: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలషించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఎదురవుతున్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Advertisement

Next Story