వాలంటీర్ వ్యవస్థ కోసం రూ.310 కోట్లు వృథా : సోము వీర్రాజు

by srinivas |
Somu Veerraju
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ ప్రభుత్వం నవరత్నాల అమలు కోసం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ.. ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకంగా మారుతోందని ఆరోపించారు. తిరుపతి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరింపులకు గురిచేశారన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.310 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని మండిపడ్డారు. పోలీస్‌, పంచాయతీ రాజ్‌, వాలంటీర్‌ వ్యవస్థల అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రచారం, పర్యవేక్షణ కోసం ఇప్పటికే రెండంచెల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రచార, నియోజకవర్గాల బాధ్యుల కమిటీకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నేతృత్వం వహిస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed